అమ్మాయిలు సెల్ ఫోన్ వాడకం పై గ్రామ పెద్దలు నిషేధం

నేడు సమాజం లో సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్ద మరియు అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా విపరీతంగా సెల్ ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్ చూడ కుండా, వాడ కుండా ఒక్క 15 నిముషాలు కూడా ఉండ లేకపోతున్నారు. అంతలా సెల్ ఫోన్ పిచ్చి ముదిరి పోయింది. సెల్ ఫోన్ వాడకం పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుంది. అది కూడా అమ్మాయిల పైన. అవును నిజమే అలాగే జరిగింది. గుజరాత్ రాష్టంలో, బనస్కాంత జిల్లా, జలాల్ గ్రామంలో  ఠాకూర్ వర్గానికి చెందిన అమ్మాయిలు  సెల్ ఫోన్ వాడకూడదంటూ, గ్రామా పెద్దలు నిషేధం విధించారు. పెళ్లి కానీ అమ్మాయిలు సెల్ ఫోన్ వాడకూడదంటూ నిషేధం విధించారు. సెల్ ఫోన్ వాడకం వల్ల అమ్మాయిలు తప్పు దారి పడుతున్నారు అని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకోకూడదని అన్నారు.

ఈ నియమాలు ఉల్లంగిస్తే అమ్మాయిల తల్లి దండ్రుల నుండి 1 లక్ష నుండి 2 లక్షల వరకు జరిమానా విదిస్తామన్నారు. అమ్మయిలు బాగా చదువులో రాణిస్తే ఉచితంగా లాప్ టాప్ అందచేస్తామన్నారు. ఈ నిర్ణయాలను స్థానిక గేనీటిన్ ఠాకూర్ కూడా సమర్ధించారు. గ్రామా పెద్దల నిర్ణయంలో ఎలాంటి  తప్పులు లేవన్నారు. సెల్ ఫోన్ వాడకం నిషేధిస్తే అమ్మాయిలు బాగా చదువులో రాణిస్తారు. అబ్బాయిలు కూడా కంట్రోల్ అవుతారు అన్నారు. ఈ నిర్ణయాలను ఎం సమర్ధించడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాలను అక్కడి అమ్మాయిలు తప్పు పడుతున్నారు. కేవలం 10 నుడి 17 ఏళ్ల అమ్మాయిల కు నిషేధం విధిస్తే సరే కానీ, 17 ఏళ్ల అమ్మాయిల పై సెల్ ఫోన్ వాడక నిషేధం మీద అక్కడ అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రాంలో జరిగిన నిషేధాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియ జేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*