హైదరాబాద్ సమీపంలో పెట్రోల్ కల్తీ వ్యాపారం

సమాజంలో కల్తీ చాల ఎక్కువైపోయింది. నిత్యావసర వస్తువులు కల్తీ చేయడం. చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ ని కూడా కల్తీ చేయడం ప్రారంభించారు. పటాన్ చెరు మండలం పాటి గ్రామ శివారులో, అవుటర్ రింగ్ రోడ్డు కు అనుకుని ఉన్న ఓ గోడౌన్ లో గుట్టుగా పెట్రోల్ కల్తీ వ్యాపారం చేస్తున్నారు. అర్ద రాత్రి గోడౌన్ లోకి ట్యాoకర్లు తీసుకెళ్లి కిరోసిన్ కలిపి పెట్రోల్ కల్తీ చేస్తున్నారు. ఒకే నంబర్ తో ట్యాoకర్లలో పెట్రోల్ రవాణా చేస్తున్నారు. గ్రామస్తులు నిఘా పెట్టి పోలీస్ లకు పట్టించారు. నాలుగు ఆయిల్ ట్యాoకర్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసారు.

పెట్రోల్ బాంక్  లలో కూడా మోసాలు జరుగుతాయి. మీరు పెట్రోల్ పోయించినప్పడు చాల జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ చెక్ చేసు చేస్కోండి. పెట్రోల్ ఎప్పుడు 100, 200, 300  లో పోయించకూడదు. ఆలా పోయిస్తే పెట్రోల్ తక్కువగా వస్తుంది. మీరు పోయించే అమౌంట్ పైన 5 ,6 రూపాయలు ఎక్కువగా పోయించండి. అప్పుడు పెట్రోల్ సరిగ్గా వస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*