
ఉత్తర్ ప్రదేశ్ రాష్టంలో, హాపూర్ జిల్లాలో, ఒక నిరుపేద కు కరెంటు బిల్ రూ.128459544.00 కోట్లు వచ్చింది. అతను ముసలి వాడు. వారి ఇల్లు చాల చిన్నది. వారి ఆస్తులు మొత్తం అమ్ముకున్న, ఆ కరెంట్ బిల్ కట్టలేరు. ఇంట్లొ ఒక టీవీ మరియు ఫ్యాన్ ఉండవచ్చు. నీరు పేద వారు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఎవరి కరెంట్ బిల్ అయినా కూడా, వెయ్యి లేదా రెండు వేలకు మించదు. అలాంటిది ఒక నిరుపేద కు 128 కోట్ల కరెంట్ బిల్ ఎలా వచ్చింది. ఆ బిల్ చూసి వారు ఆశ్చర్య పోయారు. కరెంట్ అధికారులను వెళ్ళి కలుస్తే, ఎవరు పట్టించు కోలేదు.
కరెంట్ బిల్ కట్టనందుకు, కరెంట్ కూడా తీసేసారు. కరెంట్ బిల్ సంగతి ఇరుగు పొరుగు వారికీ చెప్తే, ఆ బిల్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్ కరెంటు డిపార్ట్ మెంట్ పని విధానం ఎలా ఉంది అనేది, దేశం మొత్తం తెలిసింది. ఇతరులు కరెంట్ డిపార్ట్ మెంట్ ను ఇంత బిల్ ఎలా వచ్చింది అని నిలదీశారు. కరెంట్ డిపార్ట్ మెంట్ వారు టెక్నికల్ ప్రాబ్లమ్ జరిగింది. సరి చేస్తాం అని చెబుతున్నారు. అదే తప్పుడు బిల్ ను ధనవంతునికి ఇస్తారా. కరెంటు బిల్ కట్టనందుకు, కరెంట్ తీసేసే ధైర్యం ఉందా, అని దేశంలో ఉన్న ప్రజలు తిడుతున్నారు.
Leave a Reply