
మన వాళ్లకు ఏదైనా ఉచితంగా వస్తుందంటే అస్సలు విడిచి పెట్టారు. అది ఏదైనా కానివ్వండి, అందరికంటే ముందుగా దాన్ని తీసుకోవడానికి లెయిన్లు కడతారు. విజయనగరం లో ఆడవాళ్లకు ఉచితంగా స్కూటీ లు ఇస్తారు అని తెలిసింది. వెంటనే ఆలస్యం చేయకుండా R T O మరియు మీ సేవ ఆఫీస్ ముందు లైన్లు కట్టారు. 10 వ తరగతి పాసైన ఆడవాళ్లకు మోడీ ఉచితంగా స్కూటీ లు ఇస్తున్నాడు అని చెప్పారంట. ఆడవాళ్లు వెంటనే R TO మరియు మీ సేవ ఆఫీసులకు వెళ్లారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటె నే ఉచితంగా స్కూటీ లు ఇస్తారు అని మరెవరో చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆడవాళ్ళలు ఆఫీస్ ముందు లైన్లు కట్టారు.
స్కూటీ లు ఇవ్వడం లేదు అని చెప్పిన వినలేదు. మాకు స్కూటీ లు ఇచ్చే దాకా వెళ్ళాము అని ఆఫీస్ ల ముందు కూర్చున్నారు. సోషల్ మీడియా లో వచ్చిన ఒక పుకారు ను పట్టుకొని, విజయనగరం ఆడవాళ్లు ఇలా చేసారు. మోడీ స్కూటీ యోజన పథకం అన్నారు. అసలు విషయం ఏమిటంటే, అప్పట్లో తమిళనాడు సీఎం జయ లలిత టూ వీలర్ స్కిం పెట్టి, మోడీ చేత రిబ్బన్ కట్ చేయించింది. ఆ విషయాన్నీ మోడీ స్కూటీ యోజన పథకం అని షోషల్ మీడియా లో ఎవరో తప్పుడు ప్రచారం చేసారు. ఈ విషయాన్నీ పట్టుకొని విజయనగరం ఆడవాళ్లు ఆఫీస్ ల చుట్టూ హడావిడి చేసారు.
Leave a Reply