ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 12 వేల కిలో మీటర్లు ప్రయాణించినా వ్యక్తి

ఇతర ప్రాంతాలకు రాష్టాలకు ప్రయాణం చేయాలంటే వేలకు వేలు ఖర్చు అవుతాయి. కానీ ఒక వ్యక్తి ఒక్క రుపాయి ఖర్చు లేకుండా 12 వేల కిలో మిటర్లు తిరిగాడు. హైదరాబాద్ లో ఉంటున్న వంగవీటి కరుణాకరన్ అనే వ్యక్తి పైసా ఖర్చు లేకుండా దేశమంతటా తిరిగాడు. ఇతను గ్రాఫిక్ డిజనర్. ఈయనకు దేశమంతా యాత్ర సాగించాలనేది చిరకాల కోరిక. తన స్వంత ఖర్చులతో కాకుండా ఉచితంగా ప్రయాణం చేయాలనుకున్నాడు. మానవులలో సహాయం చేసే గుణం, మనవత్వం ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎలా చేసాడు. కరుణాకరన్ తన స్వస్థలం అయిన కొత్త గూడెం నుండి యాత్ర ప్రారంభించాడు. మొదట లిఫ్ట్ అంటు బైకుల తో ప్రారంభించి, కారు ఎడ్ల బండి, లారీ ఏది దొరికితే దాని మీద యాత్ర కొనసాగించాడు.

వివిధ ప్రాంతాలకు చేరిన తరువాత, ఆ రాత్రి అక్కడ బస చేసి మరుసటి రోజు యాత్ర కొనసాగించాడు. ఇతని యాత్రను చూసి కొంత మంది ఇతనికి ఆర్థిక సహాయం చేస్తామంటే, కరుణాకరన్ తిరస్కరించాడు. తొలుత 15 రోజుల్లో 3,500 కిలో మీటర్లు ప్రయాణం చేసాడు. తరువాత 28 రోజుల్లో 8,500 కిలో మీటర్లు ప్రయాణం చేసాడు. మొత్తం దేశమంతా 12 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసాడు. నేపాలు అనే దేశానికీ కూడా వెళ్ళాడు. అక్కడ నాలుగు రోజులు ఉన్నాడు. తెలియని వారి ఇంట్లో నిద్ర పోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం కొత్త అనుభూతునిచ్చింది అన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*