
కోడికి ఇంగ్లీష్ పాఠాలు అంటే చాల ఇష్టం. తెలుగు లేక మరొక భాషా పాఠాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒక్క ఇంగ్లీష్ పాఠాలు మాత్రమే ఇష్టం. కోడి ఏంటి ఇంగ్లీష్ పాఠాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా. అవును నిజమే. కోడికి ఇంగ్లీష్ పాఠాలు వినడం అంటే చాల ఇష్టం. వేరే ఇతర పాఠాలు వినడం అస్సలు నచ్చదు. వైజాగ్ మూర్తి గారి ఇంట్లో కోళ్లు ఉన్నాయి. అందులో ఒక కోడికి ఇంగ్లీష్ పాఠాలు అంటే మహా ఇష్టం. వాళ్ళ అబ్బాయి కౌశల్ వాటికీ దాన వేస్తూ వాటిని ప్రేమగా చూసుకుంటాడు.
కౌశల్ కు చుదువు మీద ఉన్న శ్రద్ధకు తల్లి దండ్రులు సంతోష పడుతున్నారు. అతడు పాఠాలు పైకి బాగా గట్టిగ చదవి నేర్చుకుంటాడు. కౌశల్ ఇంగ్లీష్ పాఠాలు చదవడం మొదలు పెట్టగానే, ఆ కోడి అతని దగ్గరకు వచ్చి చేరుతుంది. అతను ఇంగ్లీష్ పాఠాలు చదువుతున్నంత సేపు అక్కడే ఉంటుంది. తెలుగు పాఠాలు లేక మరొక భాష పాఠాలు చదవడం మొదలు పెడితే అక్కడి నుండి వెళ్లి పోతుంది. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రలు, చుట్టాలు చాల రోజుల నుండి గమనించారు. చివరకు ఆ కోడికి ఇంగ్లీష్ మాత్రమే ఇష్టమని తెలుసుకున్నారు.
Leave a Reply