ఒక్క రోజు భోజనం పెట్టి 4 కోట్లు సంపాదించాడు

ఇంటిలో పండగ, దావత్, పెళ్లిళ్లకు చుట్టాలను మరియు అతిధులను ఆహ్వానించి విందు ఇస్తాము. ఎవరి తాకత్ ను బట్టి వారు విందు ఇస్తారు . అప్పడు ఖర్చు భారీగా అవుతాయి. వచ్చిన అతిధులు కట్నాలు, చవివింపులు పేరుతొ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు టీ ఖర్చులు కూడ భర్తీ చేయవు. కానీ ఒకతను ఉరికే విందు ఇచ్చి 4 కోట్లు సంపాదించాడు. విందు ఇస్తే ఖర్చవుతుంది, కానీ 4 కోట్లు ఎలా వస్తాయి ? అది ఎలా సాధ్యం ? అనుకుంటున్నారా ? ఐతే చూడండి.

తమిళనాడు లోని పుదుపొట్టై జిల్లా వడగడు గ్రామంలో, కృష్ణ మూర్తి అనే  రైతు విందు ఇచ్చి ఏకంగా 4 కోట్లు సంపాదించాడు. రైతు కృష్ణ మూర్తి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. నిండా అప్పులలో మునిగి ఉన్నాడు. అతడు గ్రామస్తులను అందరిని పిలిచి విందు ఇచ్చాడు. సుమారు 50 వేల మందికి, 1000 కిలోల మాంసాము తో విందు ఇచ్చాడు. దానికి అతనికి 15 లక్షల ఖర్చు అయింది. విందు ఆరగించిన గ్రామస్తులు, తమకు తోచి నంత చదివింపులు, చదివించారు. ఆ డబ్బులు మొత్తం లెక్క చెస్తే 4 కోట్లు అయినాయి. డబ్బులు లెక్కించ దానికి కౌంటింగ్ మెషిన్ తెప్పించారు. బ్యాంకు వారి సహాయం తీసుకున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసులు కూడా చూసారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు, విందు ఇచ్చే సంప్రాదాయం, తమిళ నాడు లోని కొన్ని ప్రాంతాలలో ఉన్నది. ఇప్పడు కృష్ణ మూర్తి విందు ఇచ్చి కోటీశ్వరుడు అయిపోయాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*