ముఖ్యమంత్రి అయిన 19 ఏళ్ల అమ్మాయి

మీకు అర్జున్ జెంటిల్ మెన్ సినిమా గుర్తుందా. అందులో అర్జున్ ఒక్క రోజు ముఖ్య మంత్రి గా ఉండి ఎన్నో పనులు చేస్తాడు. ఒక్క రోజు పరిపాలనకే బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటాడు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి కదా ! కానీ నిజ జీవితం లో జరిగింది. ఒక అమ్మాయి ఒక్క రోజు ముఖ్య మంత్రిగా వ్యవహరించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రలో హరిద్వారకు జిల్లా దావ్లత్ పూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి అనే 19 ఏళ్ల అమ్మాయి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టింది.

సృష్టి గోస్వామి ప్రస్తుతం B.SC డిగ్రీ చదువుతుంది. తండ్రి కిరణాదుకాణం నడుపుతాడు. ఆమె తల్లి అంగన్వాడీ వర్కరగా పని చేస్తుంది. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా ఉన్న గైడ్సెన్ నుండి ఆమె పరిపాలన చేపట్టింది. ప్రభుత్వ అధికారులు రాష్ట్రములోని పరిస్థితులను ఆమెకు వివరించారు. ఆమె ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉంటె ప్రస్తుత సీఎం తీవ్రంద్ర సింగ్ ఆమెకు సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలను ఆమె పరిశీలిస్తున్నారు. ఉత్తరాఖండ్ చైల్డ్ రైట్స్ ప్రొటక్షన్ కమిషన్ ఈ ఏర్పాట్లను చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*